Monday, June 16, 2008

.

కేంద్రములో మద్యంతర ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి గండ సూచన
.
గ్రహముల ప్రయాణమును బట్టి వ్యక్తి జీవితము లేక దేశము మరియు రాష్ట్రములలో మార్పులు కలుగుతుంటాయి. ప్రస్తుత పరిస్తితి బట్టి మనదేశములో, మన రాష్ట్రములో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నది . రాన్నున్న కొంత కాలములో కేంద్రములో ప్రభుత్వము పడి పోతుంది. అందువలన మధ్యంతర పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి . ప్రజలకి, ప్రభుత్వమునకు తెలియజేస్తున్నాము. అతి పెద్ద పార్టి అధినాయకురాలి జాతక రిత్యా ఈ పరిస్తితి కలుగుతుంది . ఈ సంఘటన జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల లో ఎప్పుడైనను ప్రభుత్వము గద్దె దిగవచ్చును. గ్రహముల గోచార రీత్యా జరుగు సంఘటనలు ముందుగానే తెలియజేస్తున్నాము . మన రాష్ట్రంలో ప్రభుత్వముపై తీవ్ర వత్తిడి పెరిగి పనులలో ఆటంకములు, జాప్యము, అసంతృప్తి , ఆలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వలన సమస్యలు కల్గును. ప్రజలు, రైతులు, కార్మికులు, కార్మిక సంస్థలు మొండి కేయును, ప్రభుత్వానికి గతంలో సహకరించిన వారు శత్రువులు గా మారి తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తారు అధినాయకుడు ప్రజలకు మేలు చెయాలని తపన ఉన్నా ఆటంకములు కలుగుతాయి. గతంలో సన్నిహితులే శత్రువులుగా మారే అవకాశం ఉన్నది. రాష్ట్రములో తీవ్ర అలజడి, ధర్నాలు, బందులతో, కుల ఘర్షణలు చెలరేగి తీవ్ర పరిణామాలు సంభవించును రాష్ట్రము అగ్నిగుండంలాగా మారుతుంది కావున ప్రజలు సహనంతో ఉండవలెను ,ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకోవలెను. ఈ సమస్యల వలన ప్రభుత్వానికి పదవి గండము ఏర్పడ వచ్చును . తగు జాగ్రత్తగా ఉండవలసినదిగా కోరుచున్నాము.

Midterm Polls in centre - Dangerous for State Govt:

Because of the positions of Navagrahas there will be changes in the country or state. According to present scenario there will be major changes in the coming days in the government. Mid term elections will come, this may happen with respect to the positions of navagrahas of the leading person’s astrology. State Government’s fear factor will increase, delay in work, dissatisfaction with bureaucrat will be a helpless situation. Problems with trade unions, NGO’s cannot be resolved and the bureaucrats are not co-operative to state government. People Supportive to government will become enemies. Though the leader is potential, faces lot of Problems. Critics, tedious, disturbances, strikes, Communal rivals, terrorist activities may happen in this state, so People and the govt have to be cautious, unless the government may face problems regarding its power in the forth coming verdict by the people.

No comments: